Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా క్రీడలు: అదరగొట్టిన ఆర్మీ షూటర్ నీరూ.. భారత్‌కు స్వర్ణం

ఆసియా క్రీడలు: అదరగొట్టిన ఆర్మీ షూటర్ నీరూ.. భారత్‌కు స్వర్ణం

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భారత్ ఎదురుచూస్తోన్న స్వర్ణం ఎట్టకేలకు వచ్చింది. అదీ షూటింగ్‌లోని రైఫిల్‌, పిస్టల్‌ విభాగాల్లో కాదు.. ట్రాప్‌ ఈవెంట్‌లో!

భారత ఆర్మీ షూటర్‌ నీరూ దండా మహిళల ట్రాప్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. 26 ఏళ్ల నీరూ అద్భుత ప్రదర్శనతో ఆసియా రికార్డును కూడా బద్దలు కొట్టింది. దీంతో ఆసియా క్రీడలు ప్రారంభమైన పది రోజుల తర్వాత భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం దక్కింది.

మంగళవారం జరిగిన ట్రాప్ షూటింగ్ ఫైనల్‌లో మొత్తం 30 షాట్లలో 28 లక్ష్యాలను ఛేదించి అగ్రస్థానంలో నిలిచిన నీరూ.. గత ఆసియా రికార్డును ఏకంగా నాలుగు షాట్ల తేడాతో అధిగమించింది. చైనాకు చెందిన సన్‌ యునాంగ్‌ 26/30 స్కోరుతో రజతం సాధించగా.. కువైట్‌కు చెందిన హజర్‌ అబ్దుల్మాలిక్‌ 21/25తో కాంస్య పతకం దక్కించుకుంది.

అంతకుముందు మహిళల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లోనూ నీరూ భారత్‌కు రజతం అందించింది. నీరూ, ఆషిమా అహ్లావత్‌, మనీషా కీర్‌ కలిసి 328 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 346 పాయింట్లతో చైనా స్వర్ణం దక్కించుకోగా.. 325 పాయింట్లతో కువైట్‌ కాంస్యం గెలుచుకుంది. ఒకేరోజు రెండు పతకాలు సాధించి నీరూ రికార్డు నెలకొల్పింది.

తొలి భారత మహిళగా..

ఆసియా క్రీడల చరిత్రలో ఇప్పటివరకు భారత మహిళా ట్రాప్‌, స్కీట్‌ షూటర్లెవరూ వ్యక్తిగత పతకం సాధించలేదు. ఈ లోటును నీరూ దండా తీర్చింది. పురుషుల విభాగంలో మాత్రం భారత్‌ గతంలో వ్యక్తిగత స్వర్ణాలు సాధించింది. 1978 ఆసియా క్రీడల్లో రణధీర్‌ సింగ్‌ పురుషుల వ్యక్తిగత ట్రాప్‌లో స్వర్ణం సాధించగా.. 2010 క్రీడల్లో రోంజన్‌ సోధీ డబుల్‌ ట్రాప్‌ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం గెలిచాడు.

strong>

ఆసియా క్రీడలు: భారత మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్‌కు సిల్వర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy