Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా క్రీడలు: బంగ్లా ఘోర ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

ఆసియా క్రీడలు: బంగ్లా ఘోర ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం దాదాపు ఖాయమైంది. క్రికెట్‌లో భారత మహిళా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా 114 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

దీంతో మంగళవారం జరగనున్న తుది పోరులో శ్రీలంకతో తలపడనుంది. ఇదిలా ఉంటే, కాంస్య పతకం కోసం పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్లు పోటీ పడనున్నాయి.

టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(100*) అజేయ శతకం బాదేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(40), స్మృతి మంధాన(37) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లా 81 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ దిలారా(27) టాప్ స్కోరర్. బౌలర్లు నందని శర్మ, దీప్తి శర్మ తలో 3 వికెట్లు తీశారు. శ్రీచరణి 2, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్ తలొక వికెట్ పడగొట్టారు.

ఇవీ చదవండి

టీమిండియాకు 'కిట్‌' సమస్య!

షూటింగ్‌లో రజతం, సుచికకు పతకం ఖాయం.. ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల వేట షురూ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy