Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా క్రీడలు: క్వార్టర్ ఫైనల్‌లో భారత్ తలపడేది ఆ జట్టుతోనే..!

ఆసియా క్రీడలు: క్వార్టర్ ఫైనల్‌లో భారత్ తలపడేది ఆ జట్టుతోనే..!

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్‌లో టీమిండియా క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా..

సోమవారం అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. శనివారం వర్షం కారణంగా జపాన్-నేపాల్ గ్రూప్-ఎ మ్యాచ్ రద్దు అయింది. దీంతో ఆతిథ్య దేశం జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాప్ 2 లో ఉన్న నేపాల్, అఫ్గాన్ తదుపరి దశకు అర్హత సాధించాయి.

నేపాల్‌ తొలుత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. సుందీప్‌ జోరా, లోకేశ్‌ బామ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి అర్ధసెంచరీలు సాధించారు. అయితే నేపాల్‌ ఇన్నింగ్స్‌ పూర్తయిన తర్వాత జపాన్‌ ఛేదన ప్రారంభించే సమయానికి భారీ వర్షం కురిసింది. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో జపాన్‌ లక్ష్యాన్ని ఛేదించే అవకాశం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

భారత్‌తో అఫ్గాన్‌ ఢీ

జపాన్‌ నిష్క్రమణతో ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌ క్వార్టర్‌ఫైనల్‌ లైనప్‌ ఖరారైంది. పోటీలో భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, అఫ్గానిస్థాన్ జట్లు నిలిచాయి. సెప్టెంబర్‌ 28న జరిగే క్వార్టర్‌ఫైనల్లో భారత్‌.. అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. మరో క్వార్టర్‌ఫైనల్లో సెప్టెంబర్‌ 29న నేపాల్‌.. శ్రీలంకతో పోటీ పడుతుంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ బౌలింగ్‌లో ఆకట్టుకోగా.. భారత్‌తో జరిగిన ఆసియా క్రీడలకు ముందు వన్డే మ్యాచ్‌లోనూ పోటీ ఇచ్చింది. అయితే బ్యాటింగ్‌లో మాత్రం ఆ జట్టు నిలకడగా రాణించలేకపోయింది. చివరకు వర్షం కారణంగా నేపాల్‌తో మ్యాచ్‌ రద్దు కావడంతో జపాన్‌ ప్రయాణం ముగిసింది.

ఇవీ చదవండి:

మెట్రో టికెట్ బాక్సులో పిల్లి కునుకు.. వీడియో వైరల్‌

బీట్‌కు తగ్గట్టుగా స్టెప్పులు.. రోబో డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy