Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆత్మీయ నేస్తం టెలీ మానస్‌

ఆత్మీయ నేస్తం టెలీ మానస్‌

  • మనసు బాధగా ఉంటే కాల్‌ చేయొచ్చు

  • మానసిక సమస్యలకు తక్షణ ఉపశమనం

  • టోల్‌ ఫ్రీ నంబర్‌ 14416

వెల్గటూర్‌(జగిత్యాల): చేయి విరిగితేనో, కాలు నొప్పిగా ఉంటేనో, జ్వరం వస్తేనో వైద్యుడి వద్దకు పరుగులు తీస్తాం.

మనసుకు బాధ కలిగితే, ఒత్తిడి, చిరాకు, ఆందోళన మనసును స్థిమి తంగా ఉండనీయక పోతే ఎవరిని సంప్రదించాలి.. ? ఎక్కడ చికిత్స చేయించుకోవాలి..? ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో తీసుకువచ్చిన ‘టెలీ మానస్‌’ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. అనుకున్న మార్కులు రాలేదని, ఉత్తీర్ణత సాధించలేదని ఎంతో మంది విద్యార్థులు ఆందోళన చెందడం చూస్తుంటాం. ఉద్యోగం దొరకలేదని కొం దరు నిరుద్యోగులు, ప్రేమ విఫలమై చెడు వ్యస నాల కు బానిసైన యువతీ యువకులు ఉన్నారు. పంట లు పండక అప్పులు పెరిగి రైతులు.. ఇలా ఎంతో మంది మానసికంగా ఆందోళన చెంది ఆత్మహత్యల వరకు వెళ్లిన సందర్భాలు కోకొల్లలు. ఆ సమయంలో ఊరటనిచ్చేవారు, ధైర్యం చెప్పేవారు, సరైన దిశా నిర్దేశం చేసే వారు లేక కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి ఆత్మీయ నేస్తమై అండగా నిలుస్తోంది ‘టెలీ-మానస్‌’.

  • 24 గంటలు అందుబాటులో..

మానసిక ఆరోగ్యానికి సంబంధించిన బాధితులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 14416 లేదా 18008914416 నంబ ర్లను సంప్రదిస్తే చాలు. శిక్షణ పొందిన కౌన్సెలర్లు, మానసిక వైద్య నిపుణులు 24 గంటలు అందు బాటులో ఉంటూ 20కి పైగా భాషల్లో సలహాలు, సూచనలు అందిస్తారు. అవసరమైన వారికి కౌన్సె లింగ్‌ ఇస్తూ మానసిక వైద్యాన్ని సిఫార్సు చేస్తారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతారు.

  • కాల్‌ చేస్తే తక్షణ కౌన్సెలింగ్‌

టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయగానే బాధితుల ఫోన్‌కాల్స్‌కు మొదట శిక్షణ పొందిన కౌన్సెలర్లు స్పందించి మీ సమస్య ఓపికగా వింటారు. మీ పేరు, నంబరు ఎవరికీ చెప్పరు. గోప్యంగా ఉంచుతారు. తక్షణమే ధైర్యం అందిస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే మానసిక వైద్యుడికి కాల్‌ కనెక్ట్‌ చేస్తారు. అవసరమైతే సమీపంలో ఉన్న జిల్లా ఆసుపత్రిలోని మానసిక వైద్యుడిని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తారు. మనసు బాగా లేనపుడు డాక్టర్‌కు చూపించుకోవడం చాలా తేలిక అవుతుంది. ఇది కేవలం కౌన్సెలింగ్‌ మాత్రమే కాదు అవసరమైతే మందులు, వైద్యం కూడా అందిస్తారు.

ఎవరు కాల్‌ చేయవచ్చు?

  • నిద్రపట్టక పోవడం, ఒత్తిడి, ఆందోళన ఉన్న వారు

  • పరీక్షల భయం, ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ గొడవలతో ఇబ్బంది పడుతున్న వారు

  • డిప్రెషన్‌, ఒంటరితనంతో బాధ పడుతున్నవారు

  • మద్యం, గుట్కా, గంజాయి ఇతర వ్యసనాల నుంచి బయటపడాలనుకున్న వారు

  • ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు వస్తున్న వారు

  • మీ కోసమే కాదు, మీ ఇంట్లో, ఇరుగుపొరుగు వారు ఎవరైనా బాధలో ఉంటే వారి కోసం కూడా కాల్‌ చేయవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy