Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆటోను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు.. ఏడుగురి మృతి, 10 మందికి గాయాలు..

ఆటోను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు.. ఏడుగురి మృతి, 10 మందికి గాయాలు..

ల్నాడు: జిల్లాలో ఇవాళ (గురువారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్‌ వద్ద ఆటోను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతులను బొంతా బాబు, బొంతా మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మమ్మ, గంగమ్మ, మరియమ్మ, చౌటుపల్లి సువార్తగా గుర్తించారు.

కాగా, బాధితులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామస్థులుగా పోలీసులు తెలిపారు. వీరంతా ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభ్యం

వెలిగొండ కట్టింది నేనే!చంద్రబాబు క్రెడిట్‌ చోరీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy