తెలంగాణ తాజావార్తలు
ఆయుష్షు తీసిన అప్పుల సాగు!
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్: పంటల సాగు కోసం చేసిన రుణాలే వారికి యమపాశాలయ్యాయి. పంటలు పండక, అప్పులు తీర్చే మార్గం లేక వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో గురువారం ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చల్లాపూర్‌లో కుమ్మరి పకీరప్ప(50) గతేడాది అప్పు చేసి ఇల్లు కట్టాడు. ఆపై పత్తి, కంది సాగు చేశాడు. అకాల వర్షాలతో దిగుబడి రాక అప్పులు తీర్చేమార్గం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. విద్యుత్ సమస్యతో పొలానికి నీరందక.. అప్పులు తీర్చే మార్గం లేక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో దగ్గు నర్సయ్య(65) ఉరేసుకున్నాడు.
అధిక లోడుతో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతుండడం వల్ల బోరులో నీరున్నా పొలానికి అందడం లేదు. దీంతో వరి నాట్లు ఆలస్యమవుతుండడం.. బాకీలు తీర్చే మార్గం కనిపించలేదు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రాంటెక్‌కు చెందిన దిగంబర్ (50) మూడేళ్ల నుంచి పత్తి సాగు చేస్తున్నా ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. దీనికి తోడు అప్పులిచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఉరేసుకున్నాడు.
related stories
-
హోం అమరచింతలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య
-
తెలంగాణ తాజావార్తలు విద్యుత్ వైరు తెగిపడి రైతు మృతి
-
చిత్తూరు వ్యవసాయ నల్ల చట్టాల రద్దుకు డిమాండ్