స్పోర్ట్స్ డెస్క్: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే రాణించాడు.
ఓవైపు వికెట్లు పడుతున్నా ఈ ఓపెనింగ్ బ్యాటర్ మాత్రం దూకుడుగానే ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు జమ చేశాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఇందుకు సంబంధించిన బీసీసీఐ ట్వీట్ కూడా చేసింది.
అభిషేక్ శ్మర సైతం తన కెరీర్‌లోని మరో హాఫ్ సెంచరీని చేసినట్లు సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే, ఆ వెంటనే 7.6వ ఓవర్‌లో లియామ్ మెకర్తీ బౌలింగ్‌లో బెంజమిన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్‌కు చేరాడు. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. అభిషేక్ శర్మ చేసిన అర్ధ సెంచరీ రద్దైంది. అతడి హాఫ్ సెంచరీని రద్దు చేసినట్లు స్కోరు బోర్డులో రివైజ్డ్ స్కోరు వచ్చింది. దీంతో కాసేపు అభిమానులు షాకయ్యారు. ఇందుకు కారణం మూన్‌డ్రా బౌలింగ్ (భారత్ ఇన్నింగ్స్ 5వ ఓవర్)లో అభిషేక్ శర్మ సింగిల్ తీశాడు. అయితే, ఆ తర్వాత అది లెగ్‌బైగా తేలింది.
దీంతో అభిషేక్ ఖాతాలో నుంచి ఆ పరుగు తొలగించారు. ఫలితంగా 20 బంతుల్లో అభిషేక్ శర్మ 49 పరుగులు చేసినట్లు తేలింది. అభిషేక్ ఔటైన అనంతరం, భారత్ దారుణంగా కుప్పకూలింది. ఎనిమిది ఓవర్లలోపే 80/3 స్కోరుకు చేరిన భారత్.. ఆ తర్వాత 148 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేజింగ్‌లో ఆ ఎడమచేతి వాటం ఓపెనర్ తప్ప మరెవరూ 25 పరుగుల మార్కును దాటలేకపోవడంతో, ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి టీ20 ఆదివారం జరగనుంది. ప్రస్తుతం భారత్ చేతిలో సిరీస్‌ను చేసే అవకాశం మాత్రమే ఉంది.

