Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష

అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష

హైదరాబాద్, జూన్ 23: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలపై మంత్రి సీతక్క రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు(మంగళవారం) జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్‌డీఓలు, డీపీఓలతో మంత్రి సమావేశమయ్యారు.

అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్ష చేశారు. ఉపాధి హామీ పథకం అమలు, కూలీలకు పనిదినాల కల్పన, పెండింగ్ మెటీరియల్ బిల్లుల చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించారు. అంగన్‌వాడీ భవనాలు, మహిళా శక్తి భవనాలు, జీపీ కార్యాలయాల నిర్మాణాలపై సమీక్షించారు. జల సంరక్షణ పనులు, చెక్‌డ్యాంల నిర్మాణాలపై అధికారులతో మంత్రి చర్చలు జరిపారు.

ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన(పీఎమ్‌కేఎస్‌వై) పనుల అమలుపై మంత్రి సమీక్ష జరిపారు. గ్రామపంచాయతీల పనితీరు, గ్రామ కార్యదర్శుల హాజరుపై సీతక్క ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి పన్నుల వసూళ్ల పురోగతిపై చర్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులపైనా సమీక్ష చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్యాల సాధనపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులకు సూచనలు చేశారు.

పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నిరంతర నీటి సరఫరా ఉండాలని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులపై పీఆర్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష చేశారు. మహిళా సంఘాల బలోపేతం, బ్యాంక్ లింకేజీల పెంపుపై సెర్ప్‌తో చర్చించారు. మహిళల జీవనోపాధి అవకాశాల విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా ప్రతి పథకం అమలు కావాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ తెలంగాణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అలాగే, గ్రామ స్థాయిలో భూగర్భ జలాలు పెంచే విధంగా 'జలసిరి' పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.

.

ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ఖట్టర్‌తో సమావేశం

Read Latest Telangana News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy