Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అదరగొట్టిన మెస్సి.. ఒకే మ్యాచ్‌లో నాలుగు గోల్స్.. వీడియో వైరల్

అదరగొట్టిన మెస్సి.. ఒకే మ్యాచ్‌లో నాలుగు గోల్స్.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి మరోసారి తన మ్యాజిక్‌ చూపించాడు. ఇంటర్‌ మయామి తరఫున ఒకే మ్యాచ్‌లో ఏకంగా నాలుగు గోల్స్‌ చేసి అదరగొట్టాడు.

మెస్సి మెరుపులతో మాంట్రియల్‌పై ఇంటర్‌ మయామి 7-1తో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్‌లుగా విజయం లేని మయామికి ఎట్టకేలకు గెలుపు దక్కింది. ప్రపంచకప్‌ తర్వాత సీజన్‌ పునఃప్రారంభమైనప్పటి నుంచి ఇంటర్‌ మయామి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓటములు చవిచూసింది. అయితే మాంట్రియల్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి భారీ విజయాన్ని అందుకుంది.

ఫ్రీ కిక్‌తో మెస్సి షో మొదలు

20వ నిమిషంలో బ్రెజిల్‌ స్టార్‌ కాసెమిరో హెడ్డర్‌తో గోల్‌ చేసి మయామికి ఆధిక్యం అందించాడు. అయితే 37వ నిమిషంలో ఫాబియన్‌ హెర్బర్స్‌ గోల్‌తో మాంట్రియల్‌ స్కోరును 1-1తో సమం చేసింది. అయితే మూడు నిమిషాలకే మెస్సి తన ప్రతాపం చూపించాడు. 40వ నిమిషంలో బాక్స్‌ అంచు నుంచి కొట్టిన లో కర్లింగ్‌ ఫ్రీకిక్‌ మాంట్రియల్‌ గోల్‌కీపర్‌ థామస్‌ గిల్లియర్‌ను ఏమార్చుతూ నెట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో మయామి 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగం ఆరంభమైన కొద్దిసేపటికే మెస్సి మరో గోల్‌ చేశాడు. దీంతో మయామి ఆధిక్యం 3-1కు చేరింది. తర్వాత మాజీ బార్సిలోనా సహచరుడు లూయిస్‌ సువారెజ్‌కు మెస్సి అద్భుతమైన పాస్‌ అందించాడు. ఆ అవకాశాన్ని సువారెజ్‌ గోల్‌గా మలచడంతో మయామి 4-1 ఆధిక్యంలోకి వెళ్లింది.

హ్యాట్రిక్‌.. ఆ తర్వాత!

83వ నిమిషంలో రోడ్రిగో డి పాల్‌ అందించిన పాస్‌ను అందుకున్న మెస్సి.. ముందుకొచ్చిన గోల్‌కీపర్‌ గిల్లియర్‌పై నుంచి తెలివిగా బంతిని లాబ్‌ చేసి హ్యాట్రిక్‌ పూర్తి చేశాడు. 89వ నిమిషంలో యువ ఆటగాడు అలెక్స్‌ షా గోల్‌తో మయామి ఆధిక్యం 6-1కు పెరిగింది. అయినా మెస్సి ఆగలేదు. అదనపు సమయంలో మరోసారి ఫ్రీకిక్‌ ద్వారా తన సిగ్నేచర్‌ షాట్‌ను చూపించాడు. చివరకు ఇంటర్‌ మయామి 7-1తో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో ఈస్టర్న్‌ కాన్ఫరెన్స్‌లో మయామి రెండో స్థానానికి చేరుకుంది. అగ్రస్థానంలో ఉన్న నాష్‌విల్లే కంటే ఏడు పాయింట్లు వెనుకబడి ఉంది.

strong>

ఆసియా కప్: పాకిస్థాన్‌తో హ్యాండ్ షేక్ వివాదం.. కోచ్ అమోల్ ఏమన్నారంటే?

మహిళల హాకీ ప్రపంచ కప్: విజేతగా అర్జెంటీనా.. షూటౌట్‌లో డచ్‌కు షాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy