Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అడవుల్లో మంట.. గ్రామాల్లో పొగ

అడవుల్లో మంట.. గ్రామాల్లో పొగ

గుండాల, మార్చి 7: హరితహారం పేరుతో రూ.కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతుంటే, అడవులు మాత్రం అగ్నికు ఆహుతి అవుతున్నాయి. రెండు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో అడవులకు నిప్పు అంటుకోవడంతో పొగ కమ్ముకున్నది. ఆదివారం మండల కేంద్రంలో 9గంటలకు పొగ ఆవరించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అడవుల్లోని మొక్కలు కాలిపోకుండా అటవీశాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు కాంట్రాక్ట్‌ పద్ధతిలో యువకుడిని నియమించారు. అయినప్ప టికీ అడవులకు నిప్పు అంటుకుని వచ్చిన పొగతో ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో అడవులు కాలీ బూడిదవుతున్నాయి. గతంలోనూ ఈతరహా సంఘటన లు జరిగాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy