Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అద్దె భవనాల్లో హెల్త్‌ క్లినిక్‌లు

అద్దె భవనాల్లో హెల్త్‌ క్లినిక్‌లు

బిల్లులు రాకపోవడంతో అద్దె చెల్లించలేక ఎంఎల్‌హెచ్‌పీల అవస్థలు

చాగలమర్రి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో హెల్త్‌క్లినిక్‌లను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.

అయితే పది నెలల నుంచి అద్దె బిల్లులు మంజూరుకాకపోవడంతో ఎంఎల్‌హెచ్‌పీలు ఇబ్బంది పడుతున్నారు. చాగలమర్రి మేజర్‌ పంచాయతీలో 6, మల్లెవేముల, చింతలచెరువు గ్రామాల్లో 2 హెల్త్‌క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఆళ్లగడ్డ సబ్‌డివిజన్‌ పరిధిలో 20 పైగా హెల్త్‌క్లినిక్‌లు అద్దెభవనాల్లోనే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అద్దెలు మంజూరు కాకపోవడంతో ఎంఎల్‌హెచ్‌పీలకు వచ్చే జీతాల నుంచి చెల్లించాల్సి వస్తోంది. దీంతో చాలీచాలని జీతాలతో వైద్యసేవలందిస్తున్న తమకు ఇది భారంగా మారిందని ఎంఎల్‌హెచ్‌పీలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పది నెలల అద్దె బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy