తెలంగాణ తాజావార్తలు
అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై హైదరాబాద్,
రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నేతలు
నేడు ఖమ్మం అభ్యర్థిపై ఠాగూర్ సమీక్ష
సాగర్ ఉపఎన్నికలపైనా సమీక్ష
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధిష్ఠానం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా దానికి కట్టుబడి ఉంటామని ఆ మూడు జిల్లాలకు చెందిన మెజారిటీ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా కృషి చేస్తామని చెప్పారు. ఈ స్థానం ఎన్నికలకు సంబంధించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో గురువారం గాంధీ భవన్లో సమీక్ష జరిగింది. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ్‌కుమార్, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ స్థానంలో కష్టపడితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఠాగూర్ అన్నారు. ఈ స్థానం ఇన్చార్జి బాధ్యతలను రేవంత్‌రెడ్డికి అప్పగించాలని చిన్నారెడ్డి ప్రతిపాదించగా.. తన లోక్‌సభ స్థానం, కొడంగల్ శాసనసభ స్థానంలో బాధ్యతలు తీసుకుంటానని రేవంత్ చెప్పారు.
ఆశావహులు ఒక్కొక్కరితో విడిగా సమావేశమైన ఠాగూర్ వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. కాగా శుక్రవారం ఉదయం ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంపై ఠాగూర్ సమీక్ష నిర్వహించనున్నారు. రెండు స్థానాలపైనా పార్టీ ముఖ్యనేతలతో మరోసారి సమావేశమై అధిష్ఠానం వద్దకు ఆమోదం కోసం తీసుకువెళ్లే పేర్లను నిర్ణయించనున్నారు. కాగా, సాగర్ ఉప ఎన్నికలపైనా శుక్రవారం గాంధీభవన్‌లో ఠాగూర్ సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై సమీక్ష ఉంటుంది. శుక్రవారం రాత్రి ఠాగూర్ ఢిల్లీకి వెళతారు.
related stories
-
తెలంగాణ వార్తలు న్యాయవాదుల హత్యపై సీఎం స్పందించాలి
-
హెరాల్డ్ కార్డ్స్ అవును మీరు విన్నది నిజమే..! చత్తీస్‌గడ్‌లో పేడ దొంగతనం జరగకుండా ఏకంగా సీసీ...
-
హోమ్ 100 ఏళ్ల వృద్ధుడికి వ్యాక్సిన్