Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అదిరిపోయే క్యాచ్ పట్టిన గిల్..  వీడియో వైరల్

అదిరిపోయే క్యాచ్ పట్టిన గిల్.. వీడియో వైరల్

స్పోర్ట్స్ డెస్క్: ధర్మశాల వేదికగా శనివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదిరించారు.

ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు.

అఫ్గాన్ ఇన్నిగ్స్‌లో 22వ ఓవర్ హర్ష్ దూబే బౌలింగ్ వేశాడు. ఈ ఓవర్లోనే గిల్ అదిరిపోయే క్యాచ్ దృశ్యం చోటుచేసుకుంది. హర్ష్‌దూబే వేసిన బంతిని అల్లా ఘజన్‌ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే స్లిప్‌లో ఉన్న గిల్ పక్షిలా ఒక్కసారిగా డైవ్ చేసి సెకన్ల వ్యవధిలో ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఇక గిల్‌ అందుకున్న స్టన్నింగ్‌ క్యాచ్‌కు ఘజన్‌ఫర్‌ నోరెళ్లబెట్టాడు.

మైదానంలోని ప్లేయర్లతో పాటు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గిల్ అదిరిపోయే క్యాచ్ తో ఖాతా తెరవకుండానే ఘజన్ ఫర్ పెవిలియన్ చేరాడు. గిల్ పట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గిల్ పట్టిన ఈ క్యాచ్‌ను చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పోలుస్తున్నారు. ధోని తన ప్రైమ్‌టైమ్‌లో సెకన్ల వ్యవధిలోనే స్టంపింగ్‌లు చేశాడు.

ఆట అదరాలి..

అమెరికా ధమాకా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy