Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అదృష్టం అంటే ఈమెదే.. ఒకే వారంలో రెండు లాటరీల గెలుపు..

అదృష్టం అంటే ఈమెదే.. ఒకే వారంలో రెండు లాటరీల గెలుపు..

దృష్టం ఒక్కసారి తలుపు తట్టడమే గొప్ప విషయం. అయితే కెనడాకు చెందిన ఓ మహిళ విషయంలో అదృష్టం వరుసగా రెండుసార్లు తలుపు తట్టింది. కేవలం ఏడు రోజుల వ్యవధిలో రెండు లాటరీ జాక్‌పాట్‌లను గెలుచుకుని ఆమె అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

కోట్లాది రూపాయలను సొంతం చేసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది (Canada lottery winner).

కెనడాలోని ఒంటారియోకు చెందిన ట్రాంగ్ ఫామ్ అనే మహిళకు ఈ అసాధారణ అదృష్టం దక్కింది. గతేడాది ఆమె తన ఆఫీసులోని నలుగురు సహోద్యోగులతో కలిసి ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ టికెట్‌కు ఏకంగా 60 మిలియన్ల కెనెడియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.407 కోట్లకు పైగా) బంపర్ జాక్‌పాట్ తగిలింది. ఆ భారీ మొత్తాన్ని ట్రాంగ్ ఫామ్‌తో సహా ఆ ఐదుగురూ సమానంగా పంచుకున్నారు (Lottery jackpot twice).

వారం రోజుల వ్యవధిలోనే ఆమె స్క్రాచ్ కార్డ్ అనే మరో లాటరీని కొనుగోలు చేశారు (Canadian woman wins lottery twice). ఆశ్చర్యకరంగా దానికి కూడా జాక్‌పాట్ తగిలింది. ఆ లాటరీతో 2.5 లక్షల కెనడియన్ డాలర్లు (దాదాపు రూ.1.6 కోట్లు) వచ్చాయి. సాధారణంగా ఒక మనిషి జీవిత కాలంలో ఒక్కసారి లాటరీ తగలడమే చాలా అరుదైన విషయం. అలాంటిది కేవలం ఏడు రోజుల వ్యవధిలో ఒకే వ్యక్తికి రెండుసార్లు భారీ మొత్తంలో జాక్‌పాట్లు రావడం కెనడా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం.. పైలట్ మృతి.!

వరుస విజయాలతో దేశ రక్షణ రంగంలో డీఆర్‌డీఓ సరికొత్త చరిత్ర

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy