Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న స్కూటీ.. ఒకరి మృతి

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న స్కూటీ.. ఒకరి మృతి

విశాఖపట్నం, జులై 31: నగరంలోని లంకెలపాలెం - అగనంపూడి మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడిని సాయిగా గుర్తించారు.

గాయపడిన బాలు అనే వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిద్దరూ అగనంపూడి గల్లవానిపాలెం ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy