భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో శివరాజ్ క్యాబినెట్ వర్చువల్ సమావేశంలో అయోధ్యలోని రామమందిరం, భూమి పూజ గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా రామాలయ ఉద్యమంనాటి జ్ఞాపకాలను వారంతా నెమరువేసుకున్నారు. ఈ సమయంలో సీఎం శివరాజ్‌సింగ్ ఉద్వేగానికి లోనయ్యారు. 1990లో పార్టీ నాయకుడు ఎల్‌కె అద్వానీ రథయాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను అందరితో పంచుకున్నారు. కేబినెట్ సమావేశంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. రామాలయ నిర్మాణ పనులు అయోధ్యలో ప్రారంభం కానున్నాయని, ప్రధానమంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో పాటు దేశంలోని ప్రజలంతా ఈ భూమి పూజా కార్యక్రమానికి సాక్ష్యంగా నిలవనున్నారన్నారు.

