Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అఫ్గాన్ సిరీస్‌కు నో ఛాన్స్: ఆశ చావలేదు.. కృనాల్ పాండ్య పోస్ట్ వైరల్!

అఫ్గాన్ సిరీస్‌కు నో ఛాన్స్: ఆశ చావలేదు.. కృనాల్ పాండ్య పోస్ట్ వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మంగళవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.

జట్టులో ప్లేయర్లను వరుస గాయాలు వెంటాడుతుండటంతో కృనాల్‌కు అవకాశం దక్కుతుందంటూ వార్తలు వచ్చాయి. ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని అభిమానులు ఆశించారు. కట్ చేస్తే.. జట్టులో కృనాల్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

కృనాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో 'ఆశ ఇంకా సజీవంగానే ఉంది' అన్నట్లు ఓ పోస్ట్ చేశాడు. దానికి ఫింగర్ క్రాస్(HOPE) ఎమోజీతో పాటు భారత జెండా ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ క్రికెట్‌ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

2021 తర్వాత టీమిండియాకు దూరం..

కృనాల్‌ పాండ్య చివరిసారిగా 2021లో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. టీ20ల్లో భారత్‌కు 19 మ్యాచ్‌లు ఆడిన అతడు 10 ఇన్నింగ్స్‌ల్లో 124 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అనూహ్య కారణాల వల్ల కృనాల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న అతడిని.. జాతీయ జట్టులోకి తీసుకుంటారని భావించారు. అయితే వాషింగ్టన్ సుందర్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. అతడు ఒకవేళ సుందర్ అందుబాటులోకి రాలేకపోతే.. కృనాల్ పేరును పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

strong>

వంద కాదు 200 శాతం క్లారిటీ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం!

ఇదేం విచిత్రం.. ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్‌డిన్‌లో పాకిస్థాన్ ఓపెన్ హైరింగ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy