Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అహ్మదాబాద్ విమాన ప్రయాణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల స్టోరీ..

అహ్మదాబాద్ విమాన ప్రయాణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల స్టోరీ..

ఇంటర్‌నెట్ డెస్క్: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్) విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది.

మధ్యాహ్నం 1.39 గంటల సమయంలో గాల్లోకి ఎగిరింది. అయితే, టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా విమాన ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై విమానం కుప్పకూలిపోయింది.

విమానం కుప్పకూలిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ భీకర ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది కాలి బూడిదయ్యారు. వీరితో పాటు హాస్టల్‌లో విద్యార్థులు, రోడ్డుపై వెళుతున్న వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే, 11A సీట్లో కూర్చున్న 'రమేష్ విశ్వాస్' అనే ప్రయాణికుడు ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దీనిపై లోతైన దర్యాప్తు చేస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలిచింది.

కన్నీళ్లు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల స్టోరీ..

ఈ ప్రమాదంలో గుజరాత్‌లోని ఖేడాకు చెందిన వృద్ధ దంపతులు రజినీకాంత్, పుష్ప బెన్ దర్జీ ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ ఇంగ్లాండ్‌లో ఉన్న తమ కుమారుడి దగ్గరకు వెళ్లడానికి విమానం ఎక్కారు. కొడుకును చూడకుండానే చనిపోయారు. నిరుపేదలైన రజినీకాంత్ దంపతులు ఎంతో కష్టపడి కుమారుడిని డాక్టర్ చదివించారు. అతడు ఇంగ్లాండ్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. డాక్టర్‌గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కోసం ఎంతో కష్టపడ్డ తల్లిదండ్రులకు అద్భుతమైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు.

వారు తనతో పాటు ఇంగ్లాండ్‌లో ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. వారు కూడా కొడుకు దగ్గరకు వెళుతున్నందుకు ఎంతో సంతోషించారు. జూన్ 12వ తేదీన జీవితంలో మొదటిసారి.. అది కూడా కొడుకు దగ్గరకు వెళ్లడానికి విమానం ఎక్కారు. విధి ఆడిన వింత నాటకంలో ప్రాణాలు కోల్పోయారు. రజినీకాంత్ దంపతుల కుమారుడు బీజే కాలేజీలో డాక్టర్ చదివాడు. అదే కాలేజీ హాస్టల్‌పై విమానం కుప్పకూలింది. రజినీకాంత్, పుష్పబెన్ సజీవదహనం అయ్యారు.

మామిడి తొక్కలతో ఇన్ని ఉపయోగాలా! తెలిస్తే ఆశ్చర్యపోతారు

రాబోయే మూడేళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy