న్యూఢిల్లీ: రేపటి నుంచి (సెప్టెబరు 21, సోమవారం) నుంచి క్లోన్ ట్రైన్లు నడవనున్నాయి. గతవారంలో రైల్వేశాఖ ఈ రైళ్ల గురించిన సమాచారాన్ని తెలియజేసింది. శనివారం నుంచి ఈ రైళ్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని కూడా ప్రకటించింది. అయితే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో పలు క్లోన్ ట్రైన్స్ వివరాలు శనివారం సాయంత్రం నాటికే మాయమయ్యాయి. దీంతో రైళ్ల టిక్కెట్లు బుక్ చేసుకుందామనుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఐఆర్సీటీసీకి చెందిన 'దిశ' ఆన్‌లైన్ హెల్ప్‌లైన్ డెస్క్ దగ్గర కూడా దీనికి సంబంధించిన సమాచారం లేకపోవడం గమనార్హం.
రైల్వే బోర్డు ప్రయాణికుల సౌకర్యార్థం 19 క్లోన్ ట్రైన్స్ నడపనున్నట్లు ఇటీవలే ప్రకటించింది.

