Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐఐటీ బాంబేలో సాధారణ స్థితి.. క్యాంపస్‌లో ముగిసిన నిరసనలు

ఐఐటీ బాంబేలో సాధారణ స్థితి.. క్యాంపస్‌లో ముగిసిన నిరసనలు

ముంబై, సెప్టెంబర్ 23: ముంబైలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బాంబేలో విద్యా కార్యకలాపాలు యథాస్థితికి చేరుకున్నాయి.

ఇవాళ్టి (బుధవారం) నుంచి క్లాసులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని, క్యాంపస్‌లో ప్రస్తుతం ఎలాంటి నిరసనలు జరగడం లేదని విద్యాసంస్థ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఘటన నేపథ్యం.. పోలీసుల దర్యాప్తు

సెప్టెంబర్ 18న ఐఐటీ బాంబేలో బీ.టెక్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్ రవీంద్ర వాకోడే (20) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనలు చెలరేగాయి.

పొవై పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ACP స్థాయి అధికారి నేతృత్వంలో, క్రైమ్ బ్రాంచ్ DCP పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది.

ఘటనకు ముందు క్లాస్‌రూమ్, లాబీ, హాస్టల్ ప్రాంతాల్లో విద్యార్థి కదలికలను సీసీటీవీ ద్వారా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేశారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లా ప్రకటనను కూడా త్వరలోనే నమోదు చేయనున్నట్లు క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి.

ఈ కేసు దర్యాప్తులో ఊహాగానాలు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఆధారాల్లేకుండా నిర్థారణకు రావద్దని ముంబై పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయాలని మీడియాకు సూచించారు.

ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy