Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఐదేళ్ల జైలు.. రూ.కోటి జరిమానా!

న్యూఢిల్లీ, అక్టోబరు 29: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కేంద్రం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు అమలు చేయనుంది. ఇకపై కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల జైలు లేదా రూ.కోటి జరిమానా విధిస్తారు. ఉల్లంఘనల తీవ్రతను బట్టి రెండూ విధించే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్‌ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు వాయు కాలుష్య సమస్య ఎక్కువగా ఉన్న సమీప ప్రాంతాలకూ వర్తిస్తుందని తెలిపింది. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లోనూ ఆర్డినెన్స్‌ అమల్లో ఉంటుందని వివరించింది.

ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో గాలి నాణ్యతా నిర్వహణకు 20 మంది సభ్యులతో కమిషన్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy