ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నామమాత్రపు మ్యాచ్‌లో తలపడుతున్నాయి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. కేకేఆర్‌కు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్(60; 30 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
అభిషేక్ పొరెల్(22), సాహిల్ ఫరాఖ్(24), అక్షర్ పటేల్(39), డేవిడ్ మిల్లర్(28) పరుగులు చేశారు. అశుతోశ్ శర్మ(18*), స్టబ్స్(0*) నాటౌట్‌గా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబె 2, అనుకుల్ రాయ్ 1, సునీల్ నరైన్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ పడగొట్టారు.

