Dailyhunt
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవల ముంబై ఇండియన్స్(Mumbai Indians) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్‌కు (CoE) వెళ్లిన సంగతి తెలిసిందే.

దీంతో అతనికి గాయమైందేమోనని అభిమానులు ఆందోళన చెందారు. ఐపీఎల్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుండటంతో బుమ్రాకు సంబంధించిన ఈ విషయం ముంబై ఫ్యాన్స్‌ను కంగారు పెట్టింది. అయితే తాజాగా వారికి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు ఎలాంటి గాయం లేదని, కేవలం ఫిట్‌నెస్ చెక్ కోసమే సీఓఈ(CoE)కి వెళ్లాడని కన్ఫర్మ్‌ అయ్యింది. దీంతో ముంబై అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, తొలి మ్యాచ్‌ నుంచే అందుబాటులో ఉంటాడని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుండగా.. ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29న ఆడనుంది. వాంఖడేలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబై తలపడనుంది.

ఐపీఎల్2025 ఎడిషన్‌లో బుమ్రా తొలి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం ముంబై ఇండియన్స్‌పై చాలా ప్రభావం పడింది. బుమ్రా రాకతో ముంబై జట్టు తిరిగి గాడిలో పడి క్వాలిఫయర్‌-2 వరకు చేరింది. గత సీజన్‌లో బుమ్రా 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా టీమిండియా తరఫున టీ20 ప్రపంచ కప్2026లోనూ అద్భుత ప్రదర్శనలు చేసి జోరుమీదున్నాడు. బుమ్రా ఫామ్‌ ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు ఆరో టైటిల్ ఊరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుమ్రా తన సామర్థ్యం మేరకు రాణించగలిగితే ఈ సీజన్‌లోనూ ముంబై ప్లే ఆఫ్స్‌కు తప్పక చేరుతుంది.

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

పంత్ ఆట తీరు మారాలి.. లేకుంటే కష్టమే: ఆకాశ్ చోప్రా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy