Dailyhunt
ఐపీఎల్ 2026: సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్  226

ఐపీఎల్ 2026: సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ 226

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ కు దిగింది.

నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి... 226 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(46), అభిషేక్ శర్మ(48) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

వారిద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఎస్ఆర్‌హెచ్ 300 మార్కును అందుకుంటుందని అందరూ భావించారు. దూకుడు మీద ఉన్న హెడ్‌ను కార్తీక్ త్యాగి ఔట్ చేసి... కేకేఆర్‌కు కాస్త ఉపశమనం కలిగించాడు. హెడ్ ఔటైనా మరోవైపు అభిషేక్ శర్మ మాత్రం తన దూకుడు ఆపలేదు. ఈ క్రమంలో వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్(14) స్వల్ప పరుగులకే రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

112 పరుగుల వద్ద దూకుడు మీద ఉన్న అభిషేక్ ను ముజరబానీ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వచ్చిన అనికేత్‌ వర్మ ఒక్క పరుగుకే ఔటై, నిరాశపరిచాడు. చివర్లో క్లాసెన్(52), నితీశ్ కుమార్ రెడ్డి(38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్ ఆరూరా 2 వికెట్లు సాధించగా.. కార్తీక్‌ త్యాగి, అనుకూల్‌ రాయ్‌ తలో వికెట్‌ తీశారు. మొత్తంగా కేకేఆర్ ముందు 227 పరుగుల టార్గెట్‌ను ఎస్ఆర్‌హెచ్ ఉంచింది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy