Dailyhunt

ఐరిస్‌/ఓటీపీతో రేషన్‌ బియ్యం

ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డుదారులకు ఐరి్‌స(కనుపాప)లేదా మొబైల్‌ ఫోన్‌కు వచ్చే ఓటీపీ(వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) ఆధారంగా చౌకధరల దుకాణాల్లో బియ్యం అందించనున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ పద్ధతి అమలవుతుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అఽధికారులను కోరారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో బయోమెట్రిక్‌(వేలి ముద్రలు) తీసుకునే పద్ధతికి బదులు ప్రత్యామ్నాయం ఆలోచించాలని హైకోర్టు గత నెలలో సూచించింది. దీంతో బయోమెట్రిక్‌ పద్ధతికి తాత్కాలికంగా స్వస్తి చెబుతూ, దాని స్థానంలో ఓటీపీ లేదా ఐరిస్‌ ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy