Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అకాలవర్షం ఆగమాగం

అకాలవర్షం ఆగమాగం

ఈదురుగాలుల తీవ్రతకు నేలవాలిన వరి

తడిచిన మిరపకాయలు, రాలిన మామిడి

పలు చోట్ల పిడుగుపాటు: ఎనిమిది పశువుల మృతి

రోడ్లపై పడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

కొత్తగూడెం, ఏప్రిల్‌ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో బుధవారం రాత్రి పలుచోట్ల గాలివాన కురిసింది. సగటున 10.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడెంలో అత్యధికం గా 36.2మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడడంతో జిల్లాలో ఎనిమిది పశువులు మృతిచెందాయి. బూర్గంపాడు మండ లంలో పిడుగుపాటుతో మూడు గేదెలు మృతిచెందాయి.

ఉప్పుసాక గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే రైతుకు చెందిన గేదె, రెండు లేగ దూడలను ఇంటి బయట కట్టేసి న సమయంలో పిడుగుపడి మృతిచెందాయి. కరకగూడెం మండలంలో పిడుగుపడి రెండు దుక్కిటెద్దులు మృతిచెం దాయి. అన్నపురెడ్డిపల్లి మండలం, దుమ్ముగూడెం మం డలం పాతబండారుగూ డెంలో ఒక గేదె, రెండు ఆవులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. గాలిదుమారా నికి విద్యుత్‌ తీగలు తెగి కిందపడటతో ఈ ప్రమాదం జ రిగింది. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు నేలకొ రిగా యి. లక్ష్మీదేవిపల్లి మం డలంలోని రేగళ్ల ప్రాంతంలో విద్యు త్‌ స్తంభాలు, చెట్లు ప డిపోవడంతో వాహనాదా రులకు తీవ్ర అంతరాయమేర్ప డింది. ఇళ్లపై రేకులు ఎగిరి పో యాయి. చంద్రుగొండ మండలం తుంగా రం, రేప ల్లెవా డ, గానుగపాడు, తిప్పనపల్లి, చంద్రుగొండ, రావికం పాడు, పోకలగూడెం, మంగయ్యబంజర, వెంకట్యా తండా లో కోతకు వచ్చిన వరి నేలపాలైంది. మామిడి తోటల్లోని మామిడి కాయలు రాలిపోయాయి. మిరప తోట ల్లోని మిరపకాయలు తడిసాయి. తుంగారానికి చెందిన గుగు ళోత్‌ పార్వతికి చెందిన రేకుల ఇల్లు గాలిదుమా రానికి కూలిపోయింది. ఇదే గ్రామానికి చెందిన రైతులు బాణోత్‌ రాంకోటి, గుగుళోత్‌ రాములు, గుగులోత్‌ దేవా, బిచ్చాకు చెందిన వరి, జొన్న చేలు నేలవాలయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy