Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్రమ అరెస్ట్‌లతో భయపెట్టలేరు..నాదెండ్ల మనోహర్ ఫైర్

అక్రమ అరెస్ట్‌లతో భయపెట్టలేరు..నాదెండ్ల మనోహర్ ఫైర్

అమరావతి: సోషల్ మీడియా పోస్టుల పేరుతో అరెస్టులు చేసి భయపెట్టలేరని జనసేన పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలపై సక్రమరీతిలో దర్యాప్తు చేయించలేని ప్రభుత్వం సోషల్ మీడియాలో ఆ ఘటనలపై పోస్టులు పెట్టారనే నెపంతో జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ''సోషల్ మీడియాలో పోస్టింగ్స్‌పై కేసులు పెట్టి అరెస్టులు చేయాలంటే ముందుగా వైసీపీ వాళ్ళనే జైళ్లకు పంపించాలి. వ్యవస్థలపైనా, వ్యక్తులపైనా ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న దుష్ప్రచారం ఆ పార్టీ పైశాచికత్వాన్ని తెలుపుతున్నాయి. హైకోర్టు, న్యాయమూర్తులపై వైసీపీ వాళ్లు చేసిన సోషల్ మీడియా పోస్టింగులుపై చర్యలేవి.

హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకూ పోలీసు శాఖ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. తక్షణమే జనసేన కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలి.'' అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy