Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అలా నేనెప్పటికీ మారను: ఆనం

అలా నేనెప్పటికీ మారను: ఆనం

నెల్లూరు: తాను రాజకీయంగా ఎప్పుడూ మారేది ఉండదని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు ఎవరి సొంతం కాదని వ్యాఖ్యానించారు. పాత రాజకీయాలు ప్రస్తుత కాలంలో చెల్లవన్నారు. జిల్లాలో ఎవరు ఎదుగుతున్నా, తెలుగుదేశం నేతలు ఒప్పుకోరని ఆయన విమర్శించారు. ''ఆనం మారిపోయాడు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆరోగ్య పరంగా నేను మారాను. వెంకటగిరి మున్సిపాలిటీలో 22 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డుల్లో ప్రచారం చేస్తున్నప్పుడు వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కొన్నివార్డుల్లో అసలు ప్రతిపక్షాలు ప్రచారం ఎక్కడా జరుగుతున్న దాఖలాలు లేవు. కచ్చితంగా మున్సిపాలిటీలో 25 వార్డులు, ఛైర్మన్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది.

ప్రచారంలో మేము రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తున్నాం'' అని ఆనం రాం నారాయణరెడ్డి ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy