Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అల వైభోగాపురములో గిన్నిస్‌పై థింసా గురి!

అల వైభోగాపురములో గిన్నిస్‌పై థింసా గురి!

  • ప్రధాని మోదీ స్వాగతానికి అద్భుత ఏర్పాట్లు

  • ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో 14 వేల మంది బాలికల రిహార్సల్స్‌

గిరిజన సంప్రదాయ నృత్యం థింసా.. బృంద గానంలాంటింది!

పది నుంచి పాతికమంది జట్టుకట్టి లయబద్ధంగా నృత్యం చేయడం దీని ప్రత్యేకత! చూపరులను ఎంతోగానో ఆకట్టుకుంటుందీ నృత్యం! అలాంటిది పదులూ వందలూ కాదు.. ఏకంగా పద్నాలుగు వేల మంది ఒకేసారి థింసా నృత్యం చేస్తే..! అద్భుతం కదూ!! ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్న భోగాపురం విమానాశ్రయం ఆవరణలో ఈ అద్భుత ఆవిష్కరణ జరగనుంది. వేలాది గిరిజన బాలికల థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలకడానికి సన్నాహాలు చేశారు.

ఇందులోభాగంగా.. సుమారు 14వేల మంది గిరిజన బాలికలు గురువారం ఎయిర్‌పోర్టు ప్రాంగణలో ప్రాక్టీసు కమ్‌ రిహార్సల్స్‌ చేశారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి విద్యార్థినులతో థింసా ఆడి సందడి చేశారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డు లక్ష్యంగా ఉత్తరాంధ్రకు చెందిన 9,10 చదువుతున్న బాలికలు.. పాడేరు ఐటీడీఏ నుంచి 7 వేలు, పార్వతీపురం నుంచి 3 వేలు, సీతంపేట నుంచి 2 వేలు, రంపచోడవరం నుంచి 2 వేలు మొత్తం 14వేల మంది తరలివచ్చారు. వీరికి విజయనగరం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల, భోగాపురంలో వసతి ఏర్పాట్లు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy