Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అల్లుడిని హత్య చేసిన మామ

రౌతులపూడి, ఆగస్టు 9: ఇంటికి వచ్చిన అల్లుడిని కిరాతకంగా నరికి చంపిన మామ ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం దారజగన్నాథపురం గ్రామానికి చెందిన పళ్ల సత్యనారాయణ తన కుమార్తె పావనిని శంఖవరం మండలం అచ్చింపేటకు చెందిన పంపబోయిన లక్ష్మణరావు(31)కు ఇచ్చి పెళ్లి చేశాడు. కాగా పది నెలల క్రితం పావని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం భార్య సంవత్సరీకానికి వచ్చిన లచ్చన్న తాగిన మైకంలో తానే పావనిని చంపి ఉరి వేసుకున్నట్టుగా చిత్రీకరించాననడంతో సత్యనారాయణ.. లక్ష్మణరావు తలనరికి హతమార్చాడు. అనంతరం తల తీసుకుని అన్నవరం పోలీసులకు లొంగిపోయాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy