కోలీవుడ్: ఇటీవల చెన్నై నగరంలో జరిగిన 18వ చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన చిత్రాల్లో 'అమల' ఒకటి. దీనిని ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపిక చేసి ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళం, మలయాళ భాషల్లో క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీని నిర్మించారు. ముషినా నిషాద్ నిర్మించిన ఈ చిత్రానికి నిషాద్ దర్శకత్వం వహించారు. శ్రీకాంత్, అంబాని శరత్, అనార్కలి, మారిక్కర్ తదితరులు నటించారు. ఒక పార్కులో ఓ యవతి అనుమానాస్పద స్థితిలో చనిపోయివుంటుంది. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తుంటారు.
పోలీస్ ఉన్నతాధికారి ఒకరు (శ్రీకాంత్) ఖచ్చితంగా ఇది హత్యేనని నమ్ముతాడు.

