Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమలాపురం: శ్రీనిధి కోవిడ్ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత

అమలాపురం: శ్రీనిధి కోవిడ్ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత

అమలాపురం: నగరంలోని శ్రీనిధి కోవిడ్ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ కొరతతో ఇద్దరు బాధితులు మృతి చెందారని బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మూడు రోజుల క్రితం కరోనాతో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చేరారు. అయితే ఆక్సిజన్ వారికి సకాలంలో సరఫరా కాకపోవడంతో ఆ ఇద్దరూ మృతి చెందారు. దీనికి ఆస్పత్రి యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ మృతి చెందిన బాధితుల కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. ఆస్పత్రిలో చేరక ముందు బాధితులకు ఆక్సిజన్ పూర్తి స్థాయిలో ఉందని, చేరితో వ్యాధి నయం అవుతుందని చెప్పిన తర్వాతే వారిని ఆస్పత్రిలో చేర్పించామని కుటుంబసభ్యులు వాపోయారు.

అయితే ఆక్సిజన్ సరఫరా విషయంలో తాము హామీ ఇవ్వలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. ఆక్సిజన్ కొరత ఉన్నప్పటికీ తాము వైద్యం అందించామని వైద్యులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy