అమరావతి : రాజధాని మార్పు తప్పదనుకుని మనస్తాపానికి గురైన ఓ దళిత రైతు ఆత్మహత్యకు యత్నించాడు. పరిపాలన వికేంద్రీకరణ, ఏపీ సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం, ఆ వెనువెంటనే మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం తెలిసిందే. అయితే రాజధాని మార్పుపై పాలకుల నిర్ణయంతో ఉద్దండరాయునిపాలెంకు చెందిన దళిత రైతు పులి పూర్ణ చంద్రరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నేలపాడులోని ఎన్జీవో టవర్స్ పక్కనేగల ఎస్కలేటర్ ఎక్కి పూర్ణ చంద్రరావు ఆత్మహత్యకు యత్నించాడు. భావితరాల భవిష్యత్, రాష్ట్రాభివృద్దితో పాటు తనకు అప్పులు, వడ్డీ సమస్య తీరాలంటే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పూర్ణ చంద్రరావు డిమాండ్ చేశాడు.
