Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను కూల్చేశాం.. ఇరాన్ ప్రకటన

అమెరికా ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను కూల్చేశాం.. ఇరాన్ ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) నేడు(సోమవారం) ధ్రువీకరించింది.

అయితే ఎమ్‌క్యూ-1 డ్రోన్ లక్ష్యాన్ని సంబంధించిన వివరాలను మాత్రం ఇరాన్ వెల్లడించలేదు. కొన్ని నెలలుగా హోర్ముజ్ వద్ద అమెరికాకు చెందిన మానవ రహిత ఎయిర్‌క్రాఫ్ట్స్‌పై ఇరాన్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎమ్‌క్యూ-1పై కూడా దాడి చేసి కూల్చేసింది.

ఇరాన్ చమురుపై తగ్గని అమెరికా శ్రద్ధ

ఇరాన్ చమురు విషయంలో తగ్గేదేలే అనే ట్రంప్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ దేశం క్రూడ్ఆయిల్‌పై తమకు పట్టు లభించే వరకూ యుద్ధం కొనసాగుతుందని పనురుద్ఘాటించారు. వెనెజువెలా మాదిరిగానే ఇరాన్ చమురు బావులను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పుకొచ్చారు. వెనెజువెలా నుంచి వచ్చిన ఆదాయం చాలాసార్లు యుద్ధానికి సహాయపడిందని వివరించారు. దాదాపు 7 నెలల నుంచి జరుగుతున్న ఈ వార్‌ ఈ సంవత్సరంలోనే ఆగుతుందని మరో వ్యాఖ్య చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

హోర్ముజ్ జలసంధిపై కీలక సమావేశం వాయిదా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy