ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. ఈ శాంతి చర్చలపై ఇరాన్ మరోసారి కఠిన వైఖరి వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో టెహ్రాన్‌లో ఇరాన్ ప్రధాన చర్చాకర్త మహ్మద్ ఘాలిబాఫ్ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో అమెరికా తీరుపై ఘాలిబాఫ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి (Iran US talks).
'అమెరికా నిజాయతీగా వ్యవహరించడం లేదు. చర్చల్లో ఇరాన్ ఎలాంటి రాజీ పడదు' అని ఘాలిబాఫ్ స్పష్టం చేసినట్లు సమాచారం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆసీమ్ మునీర్ టెహ్రాన్ వెళ్లి ఇరాన్ నాయకత్వంతో కీలక చర్చలు జరిపారు. చర్చల్లో అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, హోర్ముజ్ జలసంధి సమస్య, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం (Asim Munir, Mohammad Baqer Ghalibaf talks).
ఈ సమావేశంలో మహ్మద్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ.. అమెరికా మాటలపై తమకు విశ్వాసం లేదని పేర్కొన్నారు (US Iran conflict). అమెరికా మళ్లీ దాడులు ప్రారంభిస్తే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినట్లు అంతర్జాతీయ వెల్లడించింది. ప్రస్తుతం ఇరాన్ తమ 14-పాయింట్ల ప్రతిపాదనపైనే గట్టిగా పట్టు పడుతున్నట్టు తెలుస్తోంది. ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ ఆస్తుల విడుదల, హోర్ముజ్ జలసంధిపై పరిమితుల తొలగింపు వంటి డిమాండ్లపై టెహ్రాన్ గట్టిగా నిలుస్తోంది.

