Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా రాజధానిలో గన్నికి ఆత్మీయ సత్కారం

అమెరికా రాజధానిలో గన్నికి ఆత్మీయ సత్కారం

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా రాజధాని పరిధిలో భానుప్రకాశ్ మాగులూరి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

అనంతరం.. రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు(ఆప్కాబ్) ఛైర్మన్, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ.. 2029 కూటమి గెలుపు రాష్ట్ర ప్రగతికి మరో మలుపని అన్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో కూటమి గెలుపు భావితరాలకు బంగారు బాటవేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి కొనసాగింపు అని చెప్పారు.

విద్య, వైద్యం, సాంకేతిక రంగాలలో రాష్ట్ర పురోగతి పట్టాలెక్కిందన్నారు గన్ని వీరాంజనేయులు. చంద్రబాబు, లోకేశ్ అవిశ్రాంత కృషి వలన రాష్ట్రాన్ని బహుళజాతి కంపెనీల పెట్టుబడులు సాధ్యమయ్యాయన్నారు. తెలుగుదేశం పార్టీ ఉనికి, విజయంతో ప్రవాసుల పాత్ర నిరుపమానమన్నారు. ఈ కార్యక్రమంలో యువతకు స్ఫూర్తినందిస్తూ ఇటీవల అమెరికాలో అత్యంత పిన్న వయసులో ఇమ్మిగ్రేషన్ అటార్నీగా పట్టా పుచ్చుకున్న, కడపకు చెందిన భూమిరెడ్డి సాయిశ్రీనివాస రెడ్డిని సత్కరించారు.

మరో అతిథి గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉందని, ఇక్కడ వనరులకు కొదవలేదని, చంద్రబాబు నాయుడి నాయకత్వం, పాలన దక్షతతో పలు రంగాలలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని, యువనేత లోకేశ్ నేటి తరానికి చెందిన నాయకత్వ లక్షణాలతో దూసుకుపోతున్నారన్నారు. సంపద సృష్టించటంతో పాటు అభివృద్ధి, సంక్షేమాన్ని సైకిల్‌కు రెండు చక్రాలుగా మలిచిన ఘనత చంద్రబాబుదన్నారు.

భాను మాగులూరి మాట్లాడుతూ.. వృత్తి, ఉపాధి రీత్యా ఏ దేశంలో ఉన్నా మాతృభూమి, మాతృబాష మనకు రెండు కళ్లు అని, పుట్టి పెరిగిన గ్రామాల అభివృద్ధికి ఎన్ఆర్ఐలు భాగస్వాములవ్వారన్నారు. జన్మభూమి స్ఫూర్తినందించిన చంద్రబాబు సమర్థ నాయకత్వాన్ని నిలబెట్టుకోవటం, పౌరులుగా మనవంతు సహకారం అందించటం మన భాద్యత అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బొల్లినేని సాయి, పొత్తూరి నాగ సత్యనారాయణ రాజు, మైనేని రామ్ ప్రసాద్, అవిర్నేని రమేశ్, కందుల అభిరామ్, ఎండూరి సీతారామారావు, సామినేని వెంకటేశ్వర్రావు, అరుణ్, అమరలింగం, వెంకట రెడ్డి, గోవర్ధన్, సుబ్బారావు, రమణ, నూరి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy