Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో దారుణం.. ఇద్దరు భారతీయ మహిళలను హత్య చేసిన స్నేహితురాలు..

అమెరికాలో దారుణం.. ఇద్దరు భారతీయ మహిళలను హత్య చేసిన స్నేహితురాలు..

ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భారతీయ మహిళలను స్నేహితురాలు హత్య చేసింది. ఒకరిని కత్తితో పొడిచి చంపగా.. మరొకరిని కారు పార్కింగ్ ఏరియాలో కారుతో ఢీకొట్టి చంపేసింది.

ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళమ్, తిరువనంతపురంలోని కేశవదాసపురానికి చెందిన 40 ఏళ్ల అన్నా మేరీ మ్యాథ్యూ.. త్రిస్సూర్, ముడిక్కొడేకు చెందిన 35 ఏళ్ల అంజనా హరి కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో నివాసం ఉంటున్నారు.

ఆగస్టు 28వ తేదీన డిక్సన్ లాండింగ్‌ రోడ్‌లో హిట్ అండ్ రన్ సంఘటన జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లగా.. అంజనా హరి పార్కింగ్ ఏరియాలో విగతజీవిగా పడి ఉంది. నీలి రంగు కారు ఆమెను ఢీకొట్టి, ఆగకుండా వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షి పోలీసులకు చెప్పారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన సమాచారంతో నీలిరంగు కారును అక్కడికి కొద్దిదూరంలోని ఓ పార్కింగ్‌ ఏరియాలో పోలీసులు గుర్తించారు. దాని యజమాని 32 ఏళ్ల అనిలాను అదుపులోకి తీసుకుని విచారించారు.

అంజనాను తానే కారుతో ఢీకొట్టి చంపినట్లు అనిలా ఒప్పుకుంది. అంజనా కంటే ముందు అన్నా మేరీని అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో కత్తితో పొడిచి చంపేసినట్లు చెప్పింది. పోలీసులు అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌ నుంచి అన్నా మేరీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనిలాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురూ ఒకే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. కొన్ని నెలల క్రితం అనిలా ఉద్యోగం కోల్పోయింది. ఉద్యోగానికి సంబంధించిన వివాదం ఈ హత్యలకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

>

పదేళ్ల క్రితమే మెస్సి రిటైర్‌మెంట్.. రొనాల్డో రియాక్షన్ వైరల్!

తిరుపతి విమానాశ్రయంలో కొత్త విమాన వేళలు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy