Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాతో డీల్ చేసుకోలేదు.. తేల్చి చెప్పిన ఇరాన్..

అమెరికాతో డీల్ చేసుకోలేదు.. తేల్చి చెప్పిన ఇరాన్..

టెహ్రాన్, జూన్ 12: ఇరాన్‌తో డీల్ కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డీల్‌కు సంబంధించి డాక్యుమెంట్లు ఫైనలైజ్‌ చేసే ప్రక్రియలో ఉన్నామని గురువారం ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన వెల్లడించారు.

మరికొన్ని రోజుల్లో డీల్ ఒప్పందంపై సంతకాలు చేస్తామని, ఒప్పందంపై సంతకాలు కాగానే హోర్ముజ్‌ జలసంధి తెరుచుకుంటుందని అన్నారు. అయితే, ట్రంప్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని మరోసారి తేలింది. అమెరికాతో ఇరాన్ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఇరాన్‌కు చెందిన సెమీ అధికారిక మీడియా 'ఫార్స్ న్యూస్ ఏజెన్సీ' తెలిపింది.

కానీ, ఒప్పందంపై సంతకం చేయడానికి టెహ్రాన్ మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొంది. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి, అమెరికా విధించిన దిగ్బంధనాన్ని తొలగించడానికి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం చర్చలో దశలో ఉందని తెలిపింది. అయితే, ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షల తొలగింపుపై ఎలాంటి ఒప్పందానికైనా మరిన్ని చర్చలు అవసరమయ్యే అవకాశం ఉందని 'ఫార్స్ న్యూస్ ఏజెన్సీ' వెల్లడించింది. ఇరాన్ స్వయంగా ప్రకటించే వరకు ఒప్పందంపై ట్రంప్ నుంచి వచ్చే ఏ వార్తనైనా ఆయన గత సందేశాలలాగే పరిగణించాలని స్పష్టం చేసింది.

కాగా, ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేయటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. గురువారం ఉదయం తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ది ట్రూత్ సోషల్'లో ఓ పోస్టుపెట్టారు. ఆ పోస్టులో..'ఇరాన్ నాయకులు నాకు నేరుగా ఫోన్ చేశారు. ఇరాన్‌పై దాడులను ఆపాలని కోరారు' అని ఆయన వెల్లడించారు. అయితే, ట్రంప్ కామెంట్లను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. 'ట్రంప్, టెహ్రాన్ నాయకుల మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం. మేము అమెరికాకు సైన్యంతోనే సమాధానం చెబుతాము' అని స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy