Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమ్మాయిలకు ఐదో స్థానం

అమ్మాయిలకు ఐదో స్థానం

  • 3-1తో జర్మనీపై గెలుపు

  • నవ్‌నీత్‌ డబుల్‌ గోల్స్‌

  • మహిళల హాకీ వరల్డ్‌కప్‌


అమ్‌స్టెల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): నవ్‌నీత్‌ కౌర్‌ డబుల్‌ ధమాకాతో.. మ హిళల హాకీ వరల్డ్‌క్‌పలో భారత్‌ 5వ స్థానంతో మెరుగ్గా ముగించింది.

గురువారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 3-1తో జర్మనీని చిత్తు చేసింది. ఇషిక (43వ నిమిషం), నవ్‌నీత్‌ (44వ, 47వ) భారత్‌ తరఫున గోల్స్‌ చేశారు. జర్మన్‌ ప్లేయర్‌ లిన్‌ క్రింగ్స్‌ (59వ) ఏకైక గోల్‌ సాధించింది. గత 52 ఏళ్లలో మన అమ్మాయిలకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 1974లో భారత మహిళలు ఐదో స్థానంలోనే నిలిచారు. 43వ నిమిషంలో ఇషిక ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌కు ఆధిక్యం అందించగా.. ఆ తర్వాతి నిమిషంలో నవ్‌నీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌లోకి పంపింది. 47వ నిమిషంలో నవ్‌నీత్‌ ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌ 3-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఆఖరి నిమిషంలో క్రింగ్‌ గోల్‌ చేసి ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది.

strong>

అండర్‌-19 జట్టులో ద్రవిడ్‌, సెహ్వాగ్‌ కుమారులు

'తోక'ను తెంచలేక..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy