Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనంతపురం జిల్లా: భారీగా అక్రమ మద్యం పట్టివేత..

అనంతపురం జిల్లా: భారీగా అక్రమ మద్యం పట్టివేత..

అనంతపురం జిల్లా: కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా తరలిస్తూ సాక్షి పత్రిక సర్క్యూలేషన్ ఏజెంట్ పోలీసులకు పట్టుపట్టాడు. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన కొడికొండ చెక్ పోస్టు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరు నుంచి అనంతపురం వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సులో నాలుగు బ్యాగుల్లో తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు.

మద్యం తరలిస్తున్న వ్యక్తి కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన సాక్షి పత్రిక సర్క్యూలేషన్ ఏజెంట్ బెస్త సురేంద్రగా పోలీసులు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. గుర్తింపు కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు దొరకడం కలకలం రేగింది.

దీని వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy