Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనంతపురం జిల్లా: సింగనమలలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా: సింగనమలలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా: సింగనమల నియోజకవర్గం మర్తాడులో ఉద్రిక్తత నెలకొంది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు ప్రయత్నించిన విద్యుత్ శాఖ అధికారులను రైతులు అడ్డుకున్నారు. మీటర్ల బిగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు పొలంలోనే బైఠాయించారు.

గతంలో ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత విద్యుత్‌ను యధావిధిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. పంపుసెట్లకు మీటర్లు బిగించినట్లయితే రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు బిగించేందుకు ఒప్పుకోమని, తమపై కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy