Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టింది: షర్మిల

అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టింది: షర్మిల

రంగారెడ్డి: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 9వ రోజు గురువారం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.

షర్మిలకు అడుగడుగునా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ప్రజలను అప్యాయంగా పలుకరించుకుంటూ, సమస్యలు తెలుసుకుంటూ ఆమె ముందుకు సాగుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే.. 'కేసీఆర్ సర్కార్ పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్లీ రావాలి' దీని కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందన్నారు. మాటమీద నిలబడే నాయకుడు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో లేరని విమర్శించారు. ప్రజలు అవకాశం ఇస్తే రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన మళ్లీ తీసుకువస్తానని షర్మిల స్పష్టం చేశారు.

 షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ కీలక నేత!  నువ్వు రాజకీయ నిరుద్యోగివి  వికారాబాద్‎లో వ్యక్తి దారుణ హత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy