Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంకితను అప్సరను చేసి.. వర్మ భలే దొరికేశాడు

అంకితను అప్సరను చేసి.. వర్మ భలే దొరికేశాడు

''రాబోయే 'థ్రిల్లర్' సినిమాతో అప్సర రాణి అనే ఏంజల్‌ని పరిచయం చేస్తున్నాను. ఆమె బడిస్సాలో పుట్టి, డెహ్రాడూన్‌లో పెరిగి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. ఆమె మంచి నటి మరియు అద్భుతమైన డ్యాన్సర్. అప్సర రాణిని కలవడానికి ముందు నాకు ఒడిశా గురించి ఏమీ తెలియదు. ఒడిశా అంటే నాకు ఇప్పటి వరకు తెలిసింది 1999లో వచ్చిన హరికేన్ మాత్రమే. అయితే అప్సరని కలిసిన తర్వాత ఒడిశా అన్ని రకాల హరికేన్‌లను సృష్టంచిందని తెలుసుకున్నా. ఒడిశాలో ఇంత అందం దాగి ఉందని నాకిప్పుడే అంటే అప్సరను కలిసిన తర్వాత తెలిసింది. ఈ బ్యూటీనే ఇప్పుడు ఒడిశాకు మరింత బలం..'' అని వర్మ మంగళవారం ట్వీట్ మీద ట్వీట్స్ చేస్తూ అప్సర రాణి అని చెబుతున్న అమ్మాయి హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేశాడు.

అయితే వర్మ పరిచయం చేస్తున్నానని చెబుతున్న అప్సర గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటికి రావడంతో.. వర్మ అడ్డంగా దొరికేశాడు.

విషయంలోకి వస్తే.. వర్మ చెబుతున్న అప్పర రాణి అల్రెడీ టాలీవుడ్‌లో రెండు సినిమాలు చేసింది. అయితే ఆమె పేరు అప్సర రాణి కాదు. అంకిత మహరాణా. ఒడిశా నుంచి తీసుకువచ్చి పరిచయం చేస్తున్నానంటూ గొప్పలు చెప్పుకుంటున్న వర్మ.. అంకిత మహరాణా పేరును అప్సర రాణిగా మార్చి పరిచయం చేస్తున్నాడు. అంతే తప్ప.. ఆమె టాలీవుడ్‌కి కొత్తకాదు. ఆమె అందాలు టాలీవుడ్ కుర్రాళ్లకు కొత్తకాదు. ఎందుకంటే ఆమె టాలీవుడ్‌లో నటించిన రెండు చిత్రాల్లో హాట్ హాట్‌గా కనిపించి అందరి మనసులు దోచేసింది. ఇంతకీ ఆమె నటించిన సినిమాల పేర్లు చెప్పలేదు కదా!. '4 లెటర్స్, ఊల్లాల ఊల్లాల' చిత్రాల పేర్లను ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసి చూడండి. అంకిత అదే వర్మ చెబుతున్న అప్సర రాణి హాట్ ఫొటోలు ఏ రేంజ్‌లో దర్శనమిస్తాయో. మరి ఆమె పేరును మార్చి.. నేనే పరిచయం చేస్తున్నానని వర్మ ఎందుకు బిల్డప్ ఇస్తున్నాడనేది ఆయనకే తెలియాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy