Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నం పెట్టలేక గురుకులాలను మూసేశారు: చంద్రబాబు

అన్నం పెట్టలేక గురుకులాలను మూసేశారు: చంద్రబాబు

అమరావతి: తిరుపతిని కించపరిచినందుకు జగన్‌పై కేసు పెట్టాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్కడ చూసినా సహజ వనరుల దోపిడీ జరురుతుందని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టడంలో రికార్డు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే సీఎం మొద్దు నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టలేక గురుకులాలను మూసేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారిందన్నారు. తిరుపతిలో రాళ్లు వేశారు, సత్యవేడులో కరెంటు తీశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు బరితెగించి దోచుకోవటం..విదేశాల్లో దాచుకోవటం తప్ప ఏం చేశారు? అని ప్రశ్నించారు. వివేకా హత్య దేశంలో ఓ సంచలమని, బాహుబలిని కట్టప్ప చంపాడని తేలింది..

బాబాయిని చంపింది మాత్రం తేలలేదన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy