పీలేరు, జూన్ 26(ఆంధ్రజ్యోతి): కారు డ్రైవర్ నిద్రమత్తు ముగ్గురిని బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణా వడ్డిపల్లె వద్ద గురువారం రాత్రి ఆటోను కారు ఢీ కొట్టడంతో పీలేరు మండలం రేగళ్లు గ్రామానికి చెందిన కె.మెహరూన్‌బీ(70) ఆమె మనవడు కె.మహమ్మద్ వాహిద్(16), ఆటోడ్రైవర్ ముబారక్(55) మృతి చెందాడు.

