Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అపార్ట్‌మెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్

అపార్ట్‌మెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్, జూన్ 23: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుర్తించారు.

ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వ్యభిచార గృహ నిర్వాహకురాలు పరారీలో ఉన్నట్లు సమాచారం. దాడుల్లో భాగంగా బెడ్‌రూమ్‌లో స్పై కెమెరా గుర్తించిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. విటుల కార్యకలాపాలను రహస్యంగా చిత్రీకరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్న ఇద్దరు యువతులను విచారిస్తున్నారు. స్పై కెమెరా ద్వారా బ్లాక్‌మెయిల్ లేదా డబ్బు వసూళ్ల కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. వ్యభిచార గృహంలో స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిర్వాహకురాలి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వ్యభిచార ముఠా వెనుక మరింత నెట్‌వర్క్ ఉందా అన్న కోణంలోనూ పోలీసుల విచారణ కొనసాగుతోంది.

.

ఎమ్మెల్యే గారూ.. ఎలా ఉన్నారు!?

విశాఖ అగ్నిప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

Read Latest Telangana News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy