Tuesday, 14 Jul, 5.06 pm ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి: సీపీ అంజనికుమార్

హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో నగర ప్రజలు భాగస్వాములు అయినప్పుడే రోడ్డు ప్రమాదాలు అదుపులోకి వస్తాయని నగర సీపీ అంజనికుమార్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలలో మరింత అవగాహ తీసుకురావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్‌సిఎస్‌సి) ఆధ్వర్యంలో తార్నాక ఎన్ఐఎన్ ఆడిటోరియంలో 'వికాప్'(స్మాల్ కాప్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర సిపీ అంజనికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికాప్ బుక్‌లెట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సీపీ.. కీలక సందేశం ఇచ్చారు. కరోనా, రోడ్ సేఫ్టీ, ఇతర విషయాల్లో హైదరాబాద్ పోలీసుల పనితీరు అభినందనీయం అన్నారు. కోటి 30 లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్‌లో అన్నిరకాలుగా రక్షణ ఉందన్నారు. విద్యాభ్యాసం ముందు ఇంట్లోనే మొదలుకావాలని ప్రజలకు సీపీ సూచించారు. ప్రతి సిటిజెన్ ఒక పోలీసుగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే వికాప్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీపీ వెల్లడించారు. ఇది పిల్లల కోసం మాత్రమే కాదని, నేటి విద్యార్థులే రేపటి యువత కాబట్టి వారికి విద్యార్థి దశ నుండే సమాజం పట్ల బాధ్యతను తెలియజేసేలా ఈ కార్యక్రమం ప్రారంభించామని సీపీ అంజనికుమార్ చెప్పారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top