Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అరంగేట్రానికి వైభవ్ సిద్ధంగా ఉన్నాడు.. కానీ!: భారత అసిస్టెంట్ కోచ్

అరంగేట్రానికి వైభవ్ సిద్ధంగా ఉన్నాడు.. కానీ!: భారత అసిస్టెంట్ కోచ్

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై ఐర్లాండ్ 2-0 తేడాతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డిస్క్‌టే ఈ విషయంపై స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి వైభవ్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని స్పష్టం చేశాడు. కానీ ఇతర ప్లేయర్ల మాదిరిగానే అతడు కూడా ఎంపిక ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని తెలిపాడు. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ర్యాన్ మాట్లాడాడు.

'వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన జట్టులో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ వంటి ప్లేయర్ల గురించి కూడా మేము ఆలోచించాల్సి ఉంది. వారిపై నమ్మకం ఉంచి వరుస అవకాశాలు ఇవ్వాలనేదే మా ఆలోచన. అందుకే వైభవ్‌ను ఐర్లాండ్ సిరీస్‌లో ఆడించలేదు. వైభవ్ ఆటను చూడాలని మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. కానీ అతడు కూడా మిగతా ఆటగాళ్ల మాదిరిగానే అదే ప్రక్రియలో ముందుకు రావాల్సి ఉంటుంది. సరైన సమయంలో అతడికి తుది జట్టులో చోటు దక్కుతుంది. వైభవ్‌కు గొప్ప భవిష్యత్తు ఉంది' అని ర్యాన్ వెల్లడించాడు.

జులై 1 నుంచి భారత జట్టు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో వైభవ్‌ అరంగేట్రం చేస్తే.. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తూ, భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. అయితే ఐర్లాండ్ పర్యటనలో భారత సీనియర్ ప్లేయర్లు విఫలమైన వేళ.. వైభవ్‌కు తుది జట్టులో లైన్ క్లియర్ అయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


మరో విషాదం.. షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా తల్లి మృతి

ఐర్లాండ్‌తో ఘోర ఓటమి.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy