చిత్రజ్యోతి
అరణ్య ఓ దృశ్యకావ్యం రానా దగ్గుబాటి

''మనుషులకూ, వన్యప్రాణులకూ మధ్య జరిగిన పోరాటంలో నగరంలో పుట్టి పెరిగిన ఓ యువకుడు వాటిని ఎలా కాపాడాడు అనే కథతో 'అరణ్య' చిత్రం తెరకెక్కింది. దర్శకుడు తనదైన శైలిలో దృశ్యకావ్యంగా మలిచారు. ఈ చిత్రంలో భాగమవ్వడం నాలోనూ మంచి మార్పుకు కారణమైంది. అడవుల్లో ఉండడం, ఏనుగులతో గడపడం వల్ల మునుపటికన్నా మనుషులతో నా అనుబంధం మరింత బలపడింది'' అని రానా చెప్పారు. ఆయన కథానాయకుడుగా విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అరణ్య'. ప్రభు సాల్మన్ దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు.
''ఈ సినిమాలో రానా ఏనుగుల క్షేమం కోసం తపించే వ్యక్తి పాత్రలో కనిపిస్తారు. భావోద్వేగాలతో పాటు వాణిజ్య హంగులున్న చిత్రం ఇది'' అని దర్శకుడు చెప్పారు. ''అరణ్యలో 'సింగా' అనే పాత్రలో నటించాను. మంచి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది. పతాక సన్నివేశాలు ఆకర్షణగా ఉంటాయి'' అని హీరో విష్ణు విశాల్ అన్నారు.
related stories
-
అమరావతి హిట్ కాంబినేషన్లో 'బార్డర్'
-
చిత్రజ్యోతి కిచ్చా సుదీప్ 'విక్రాంత్ రోణ' రిలీజ్ డేట్ ఫిక్స్
-
చిత్రజ్యోతి ఏప్రిల్ నెలాఖరులో రానున్న 'బజార్ రౌడీ'