Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అసెంబ్లీలో ఆ తీర్మానానికి ఆమోదం.. సీఎం విజయ్‌పై కమల్ ప్రశంసలు..

అసెంబ్లీలో ఆ తీర్మానానికి ఆమోదం.. సీఎం విజయ్‌పై కమల్ ప్రశంసలు..

ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో తమిళత్తాయ్ గీతాన్ని మొదటగా ఆలపించాలనే తీర్మానాన్ని శాసనసభ ఆమోదించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ మేరకు కమల్ హాసన్ తన ఎక్స్ ఖాతాలో మంగళవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. 'ప్రభుత్వ కార్యక్రమాలలో తమిళత్తాయ్ గీతాన్ని మొదటగా ఆలపించాలనే తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించడం సంతోషకరం. ఇది కచ్చితంగా స్వాగతించదగినది. రాష్ట్ర హక్కులను వదులుకోని ఈ విధానం ఇలాగే కొనసాగాలి' అని రాసుకొచ్చారు.

కేంద్రం వర్సెస్ తమిళనాడు..

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ గేయమైన 'వందేమాతరం'ను మొదటగా ఆలపించాలని, ఆ తర్వాతే ఇతర గీతాలను ఆలపించాలని కేంద్ర హోంశాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్గత మార్గదర్శకాలను, సూచనలను జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ఈ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 'తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మన ప్రాణం, భావోద్వేగం' అని ఆయన పేర్కొన్నారు. సీఎం విజయ్ ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక తీర్మానానికి అసెంబ్లీలోని ప్రధాన ప్రతిపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి.

>

రాజస్థాన్ వీడియోతో పంజాబ్‌లో రాజకీయ దుమారం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy